Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇండియన్ ఎయిర్ ఫోర్స్...ఇండియన్ ఆర్మీకి సోషల్ మీడియాలో నీరాజనాలు

సోషల్ మీడియాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీకి నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. వరదలబారిన పడిన చెన్నై వాసులకు హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలు జారవిడుస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సేవలను అంతా కొనియాడుతున్నారు. అలాగే చెన్నైలో నెలలు నిండిన ఓ గర్భవతిని ఆసుపత్రిలో చేర్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా షేర్ అవుతోంది. 'సలాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్' అనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. అలాగే చెన్నైలోని సహాయకచర్యల్లో పాల్గొన్న ఓ సైనికుడు మోకాలి లోతులో ఆకలితో ఉన్న కుక్కకు బిస్కెట్లు పెడుతున్న ఫోటోను 'మనుషులపైనే కాదు, జంతువులపై కూడా ఇండియన్ ఆర్మీ ప్రేమ చూపిస్తుంది' అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేసుకుంటూ ఇండియన్ వైమానిక, సైనిక దళాలను అభినందిస్తున్నారు.

More Telugu News